Saluru Assembly Constituency Profile
సాలూరు గతంలో విజయనగరం జిల్లాలో ఉండేది. జిల్లాల
పునర్వ్యవస్థీకరణ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో భాగమైంది. సాలూరు షెడ్యూల్డు
తెగల వారికి రిజర్వ్ అయిన నియోజకవర్గం. సాలూరులో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి
సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సాలూరు ఆ
పార్టీ అధీనంలోనే ఉంది. 1989 తర్వాత కాంగ్రెస్ మళ్ళీ 2009లోనే గెలిచింది. రెండు
దశాబ్దాల విరామం తర్వాత విజయం సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత తెరమరుగైంది. కానీ కాంగ్రెస్
ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, వైఎస్‌ఆర్‌సిపిలో చేరి 2014, 2019 ఎన్నికల్లోనూ విజయం
సొంతం చేసుకున్నారు.
సాలూరు నియోజకవర్గానికి
15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పీడిక రాజన్నదొర, మరో ఐదేళ్ళు అదే సీటు
దక్కించుకోడానికి, ఇప్పుడు 2024లోనూ వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఎన్‌డిఎ
కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి గుమ్మిడి సంధ్యారాణి పోటీ పడుతున్నారు. ఇండీ
కూటమి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మువ్వల పుష్పారావు నిలబడ్డారు. అయితే
ప్రధానంగా పోటీ వైసీపీ-టీడీపీ మధ్యనే ఉంది.