Kurupam Assembly Constituency Profile
తొలుత విజయనగరం జిల్లాలో ఉన్న కురుపాం
నియోజకవర్గం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో భాగమైంది. కురుపాం మొదట్లో నాగూరు
నియోజకవర్గంలో ఉండేది. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా
ఏర్పాటయింది. షెడ్యూల్డు తెగలకు రిజర్వ్ ఐన ఈ నియోజకవర్గంలో పరిధిలో కురుపాం,
గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి అనే ఐదు మండలాలు ఉన్నాయి.
80వ దశకం నుంచీ ఈ స్థానం దాదాపుగా కాంగ్రెస్
చేతిలోనే ఉంది. 1994లో టిడిపి, 2004లో సిపిఐ చెరోసారీ గెలిచాయి. కానీ రాష్ట్ర విభజన
తర్వాత పరిస్థితి మారిపోయింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన
జనార్దన్ దాట్రాజ్, రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశంలో చేరారు. కానీ ఫలితం
లేకపోయింది. 2014లోనూ, 2019లోనూ వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి పాముల పుష్పశ్రీవాణి జనార్దన్
దాట్రాజ్‌పై విజయం సాధించారు. పుష్పశ్రీవాణి మొదటిసారి కంటె రెండోసారి 7500 ఎక్కువ
ఓట్లతో గెలవడం విశేషం.
ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో
ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి తోయక జగదీశ్వరి బరిలో నిలిచారు. ఇండీ
కూటమి తరఫున సిపిఎం అభ్యర్ధి మండంగి రమణ పోటీలో ఉన్నారు.