సీఎం జగన్పై రాయి దాడి ఘటన
దర్యాప్తునకు సంబంధించి విజయవాడ కోర్టులో
పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు వెల్లడించాలని న్యాయవాది
సలీం ఈ పిటిషన్ వేశారు.
కేసు విచారణలో భాగంగా విజయవాడ అజిత్సింగ్
నగర్ ప్రాంతానికి చెందిన కొంతమంది
అనుమానితులు పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని రహస్య ప్రాంతాల్లో
విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వారి వివరాలు తెలపాలంటూ న్యాయవాది
సలీం కోర్టును కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ
అజిత్ సింగ్ నగర్ లో పర్యటిస్తున్న సీఎం జగన్ పైకి రాయి విసిరారు. జగన్ తో పాటు వైసీపీ
సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లికి కూడా తగిలింది. దీంతో కాసేపు జగన్ పర్యటనకు
అంతరాయం ఏర్పడింది. ప్రథమ చికిత్స అనంతరం సీఎం జగన్ తన పర్యటన కొనసాగించారు.
వెలంపల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో అమాయకులను ఇరికించే ప్రయత్నం
జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలను అభిమానులను కేసుల పేరుతో వేధించే
కుట్ర జరుగుతోందంటున్నారు. సీఎం జగన్ పై
దాడి కేసులో తమను ఎక్కడ ఇరికిస్తారోనని భయపడి పలువురు ఇళ్ళు కూడా ఖాళీ చేశారని
టీడీపీ నేతలు వాపోతున్నారు.