సార్వత్రిక
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ సహా మరో పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ
ప్రారంభమైంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో
పాటు శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో
నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి
మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నామినేషన్ల
స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీ కాగా, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
ఉంటుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల
ఉపసంహరణకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది.
మొత్తం పది రాష్ట్రాల పరిధిలోని
96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
లోక్‌సభకు
పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే వారు నియోజకవర్గాలలోని ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ
నామినేషన్ల పత్రాలు సమర్పించాల్సి ఉంది.
నామినేషన్ల
ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డు
చేయనున్నారు.
ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక
అభ్యర్థి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే వెసులుబాటు ఉంది.
ఎంపీ
అభ్యర్థి అయితే ఫారం–2A, ఎమ్మెల్యే అభ్యర్థి
ఫారం–2B దాఖలు చేయాలి. సువిధ
యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు
చేసినప్పటికీ వాటి కాపీలను
భౌతికంగా ఆర్వోలకు అందజేయాలి.
ఎన్నికల
సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థికి స్థానికంగా ఉండే ఒక ఓటరు, ప్రపోజర్‌గా
సంతకం చేయాలి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది
ప్రతిపాదించాలని నిబంధనల్లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఒక ఓటరు
ఎంతమంది అభ్యర్థులనైనా ప్రపోజ్ చేయవచ్చు.
నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్)
కూడా అభ్యర్థులు సమర్పించాలి. ఇందులో పోటీచేసే
అభ్యర్థులు తమ కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు
క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని
కేసుల వివరాలు తెలపాలి.
నామినేషన్
ఫీజు కింద పార్లమెంటుకు పోటీ
చేసే అభ్యర్థి రూ.25,000లు, అసెంబ్లీకి
పోటీ చేసే అభ్యర్థి రూ. 10,000లు చెల్లించాల్సి
ఉంది.
శాసనసభ స్థానాలకు
పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు ఎన్నికల
సంఘం అనుమతించింది. ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు ఎన్నికల ప్రచార వ్యయం చేసేందుకు అవకాశముంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు