16
districts in AP record temperatures over 43°C
ఆంధ్రప్రదేశ్లో గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది.
శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229
మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం
ఉన్నట్లు విపత్తుల సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
గురువారం శ్రీకాకుళంలో 12 , విజయనగరంలో 22, పార్వతీపురం మన్యంలో 13, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4, అనకాపల్లిలో 11, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 2, ఎన్టీఆర్లో 2, పల్నాడులో 7 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే
అవకాశం ఉంది.
అలాగే శ్రీకాకుళంలో 14 , విజయనగరంలో 5, పార్వతీపురం మన్యంలో 1, అల్లూరి సీతారామరాజులో 11, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 6, కాకినాడలో 12, కోనసీమలో 7, తూర్పుగోదావరిలో 17, పశ్చిమ గోదావరిలో 3, ఏలూరులో 19, కృష్ణాలో 13, ఎన్టీఆర్లో 14, గుంటూరులో 17, పల్నాడులో 16, బాపట్లలో 12, ప్రకాశంలో 24, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 11, నంద్యాలలో 1, వైఎస్సార్లో 1, తిరుపతిలో 7 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది.
బుధవారం నంద్యాల జిల్లా పెద్ద
దేవళాపురంలో 44.9°C, పార్వతీపురంమన్యం మక్కువ, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.3°C, అనకాపల్లి జిల్లా రావికవతం, విజయనగరం జిల్లా
రామభద్రాపురం, తుమ్మికపల్లి, ప్రకాశం జిల్లా దొనకొండ, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.1°C, కర్నూలు జిల్లా వగరూరు 43.9°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 16 జిల్లాల్లో 43°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి
సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు
తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్
రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి
నీరు, లస్సీ మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ సూచించింది.