Lord Ram is the faith of Bharat, basis for Bharat
************************
(నేడు శ్రీరామనవమి)
***********************
రామచంద్రుడు భారతదేశపు ఆత్మలోని ప్రతీ కణంతో
జోడించబడి ఉన్నాడు.
రాముడు భారతదేశవాసులందరి మనోకుహరాల్లో విరాజమానుడై
ఉన్నాడు.
దేశాన్నంతటినీ ఏకత్రితం చేయగల సూత్రం రాముడు.
రమంతే యస్మిన్ ఇతి రామః. అందరినీ రంజిల్లజేసేవాడే
రాముడు.
రాముడు ఈ దేశపు స్మృతుల్లో పర్వతాల నుంచి పరంపరల
వరకూ అంతటా ఉన్నాడు.
ప్రతీ యుగంలోనూ ప్రజలు రాముడితో జీవించారు.
ప్రతీ యుగంలోనూ ప్రజలు తమ మాటల్లో తమ పద్ధతుల్లో
రాముణ్ణి వ్యక్తీకరించారు.
రామరసం జీవన ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూనే
ఉంటుంది
ప్రాచీనకాలం నుంచీ భారతదేశంలోని ప్రతీ
ప్రాంతంలోని ప్రజలూ రామరసాన్ని పానం చేస్తూనే ఉన్నారు.
రామకథ ఎల్లలు లేనిది. రామాయణం అనంతమైనది.
రాముడి ఆదర్శాలు, రాముడి విలువలు, దేశమంతటా ఒకేలా
ఉన్నాయి.
రాముడు అగ్ని కాదు… శక్తి.
రాముడు వివాదం కాదు… పరిష్కారం.
రాముడు ఏ ఒక్కరివాడో కాదు… రాముడు అందరివాడు
రాముడు కేవలం వర్తమానం కాదు… రాముడు
అనంతకాలరూపుడు.
రాముడు భారతదేశపు విశ్వాసం… రాముడే
భారతదేశానికి ఆధారం
రాముడు భారతదేశపు ఆలోచన… రాముడే భారతదేశపు
విధానం
రాముడు భారతదేశపు చైతన్యం… రాముడే భారతదేశపు
చింతన
రాముడు భారతదేశపు ప్రతిష్ఠ…. రాముడే భారతదేశపు
ప్రతాపం
రాముడు ప్రవాహం…. రాముడే ప్రభావం
రాముడు నేతి…. రాముడే నీతి
రాముడు నిత్యుడు…. రాముడే నిరంతరుడు
రాముడు విభుడు… రాముడే విషదుడు
రాముడు వ్యాపకుడు…
రాముడే విశ్వం…. రాముడే విశ్వాత్మ!
***(అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగంలోనుంచి)***
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు