సార్వత్రిక ఎన్నికల వేళ చత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన
ఎన్కౌంటర్లో 29 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన మావోయిస్టుల్లో కీలక నేత శంకర్రావు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ సీఐ, ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
పోలీసుల సాయంతో బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఛోటేబేథియా సమీపంలోని హపటోలా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ ముగిసిన తరవాత ఏకే 47 తుపాకులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో గాయపడిన భద్రతా సిబ్బందిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం