bus falls from flyover, Five killed, several injured, Odisha’s
Jajpur
ఒడిశాలో
ఘోరం జరిగింది. బస్సు ఫ్లైఓవర్ నుంచి పడిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన
జాజ్పుర్ జిల్లా బారాబటి పరిధిలో ఎన్హెచ్ -16పై చోటుచేసుకుంది.
కటక్
నుంచి బెంగాల్ లోని దిఘాకు వెళుతున్న బస్సు బారాబటిలో ప్లైఓవర్ పై నుంచి అదుపుతప్పి
కిందపడింది. దీంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు.
ప్రమాద సమయంలో
బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి
చేరుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీకి తరలించినట్లు
జాజ్పుర్ ఎస్పీ వినీత్ అగర్వాల్ తెలిపారు. గాయపడిన 38 మందిలో ఒకరి పరిస్థితి
విషమంగా ఉన్నట్లు జాజ్పుర్ జిల్లా వైద్యాధికారి శిబాసిస్ మోహరానా తెలిపారు.
ఘటనపై
విచారం వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మృతుల కుటుంబాలకు రూ. 3
లక్షల నష్టపరిహారం ప్రకటించారు.