ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. సీబీఐ తరపు న్యాయవాది 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరారు. కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా 9 రోజుల కస్టడీకి అనుమతించారు. దీంతో కవితను తిహార్ జైలుకు తరలించారు.
కవిత సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరపు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడీషియల్ కస్టడీలో కవితను మరోసారి ప్రశ్నించే అవకాశముంది. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన సమాచారంతో సీబీఐ కవితను మూడు రోజులుగా విచారించింది. అయినా సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు తెలిపారు.
సీబీఐ విచారణపై కవిత మండిపడ్డారు. బీజేపీ నేతలు బయట లేవనెత్తుతోన్న ప్రశ్నలనే సీబీఐ కూడా అడుగుతోందని కవిత విమర్శించారు. 2 నెలలుగా అడిగిన ప్రశ్నలే మరలా అడుగున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు