కెనడాలో భారత విద్యార్థి హత్యకు
గురయ్యాడు. చిరాగ్ అంటిల్ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు
తెలిపారు. విద్యార్థి మృతి విషయాన్ని సౌత్
వాంకోవర్ పోలీసులు వెల్లడించారు.
కాల్పుల శబ్దం వినిపించినట్లు ఏప్రిల్
12న రాత్రి 11 గంటల సమయంలో ఈస్ట్ 55 అవెన్యూ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం
అందింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా కారులో చిరాగ్ మృతదేహాన్ని
గుర్తించారు. చిరాగ్,మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు
క్రౌడ్‌ఫండింగ్ చేస్తున్నట్లు అతడి సోదరుడు రోహిత్ అంటిల్ తెలిపారు.