ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై జరిగిన రాయి దాడిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. సీఎంపై దాడికి సంబంధించిన అన్ని వివరాలు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కోరింది. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.
ఇటీవల ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యం, తాజాగా సీఎం జగన్మోహన్రెడ్డిపై రాయి దాడి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం పలు ప్రశ్నలు వేసింది.ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఆరు మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే. సీఎం జగన్మోహన్రెడ్డిపై దాడి నేపథ్యంలో భద్రతా వైఫల్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు