అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలు నిజమయ్యారు. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు మొదలుపెట్టింది. గత వారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో సిరియాకు చెందిన కీలక కమాండర్లు చనిపోయారు. సిరియాలోని ఎంబసీ వద్ద జరిగిన దాడితో ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌ను ఇరాన్ పలుమార్లు హెచ్చరించింది. శనివారం డజన్ల కొద్దీ డ్రోన్లు దూసుకెళుతున్నట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. చాలా డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేసిందని ఇప్పటికే సరిహద్దులను ఇజ్రాయెల్ మూసివేసింది. సిరియా, జోర్డాన్ కూడా తమ దళాలను అప్రమత్తం చేశాయి.
సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి ఘటన తరవాత ఇజ్రాయెల్ తీరుపై పశ్చిమదేశాలు గుర్రుగా ఉన్నాయి. ఎంబసీపై జరిగిన దాడిలో సీనియర్ కమాండర్లు చనిపోయారు. ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఇరాన్ హెచ్చరించింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను గమనిస్తోన్న అమెరికా, శుక్రవారం నాడు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ దాడులతో అమెరికా హెచ్చరికలు నిజమయ్యాయి.ఇజ్రాయెల్‌కు అన్ని రకాల సాయం అందిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ హామీ ఇచ్చారు.