Scorching Sun to Suffocate on Sunday and Monday
ఆదివారం 18 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు,151 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సోమవారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు,135 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రకటించింది.
ఆదివారం పార్వతీపురంమన్యం
జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 3 మండలాల్లో తీవ్రవడగాడ్పులు వీచే
అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.
అలాగే శ్రీకాకుళం జిల్లాలో 16 ,
విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యం జిల్లాలో 6, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 11, విశాఖపట్నం జిల్లాలో 3,అనకాపల్లి
జిల్లాలో 16, కాకినాడ జిల్లాలో 13, కోనసీమ జిల్లాలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 19, పశ్చిమగోదావరి జిల్లాలో 5, ఏలూరు జిల్లాలో 12,
కృష్ణా జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 6, పల్నాడు జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని
వెల్లడించింది.
ఇంక ఇవాళ ఉష్ణోగ్రతల సంగతి చూస్తే… శ్రీకాకుళం
జిల్లా కొవిలంలో 41.6°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లి,విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.5°C, నంద్యాల జిల్లా నందవరంలో 41.2°C, మన్యం జిల్లా సాలూరులో 40.7°C, కోనసీమ జిల్లా అయినవల్లి 40.6°Cఅధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 34 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల సంస్థ తెలియజేసింది.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి
సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు
తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి.
డీహైడ్రేట్ అవకుండా ఉండడానికి ఒఆర్ఎస్, ఇంట్లో తయారుచేసుకునే లస్సీ, నిమ్మకాయ
నీరు, మజ్జిగ, కొబ్బరి
నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ సూచించింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు