దిల్లీ
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీకి రౌస్
అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతించింది.
కవితను
ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరగా, మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో
రేపటి(శనివారం) నుంచి ఈ నెల 15
వరకు కస్టడీలోకి తీసుకుని కవితను సీబీఐ విచారించనుంది.
దిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా కవితను కస్టడీకి అప్పగించాలంటూ దాఖలు
చేసిన పిటిషన్ లో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. మద్యం కుంభకోణం కేసు
విచారణలో కవిత చాలా కీలకమని, ఆమ్
ఆద్మీ పార్టీకి ఆమె రూ.100 కోట్లు చెల్లించారని పిటిషన్‌లో పేర్కొంది.
తెలంగాణ జాగృతి సంస్థకు లిక్కర్ స్కామ్ లో
నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల
ముడుపులు ఇచ్చారని తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని కోర్టుకు
సీబీఐ తెలిపింది.