ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ఏడాది పరీక్షలను 4 లక్షల మంది విద్యార్థులు రాయగా 67 శాతం, రెండో ఏడాది పరీక్షలకు 3 లక్షల మంది హాజరుకాగా 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో 71 శాతం మంది పాసయ్యారు.
మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా టాప్ లో నిలువగా, 81 శాతంతో గుంటూరు సెకండ్ ప్లేస్ సాధించగా 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో ఉంది. రెండో ఏడాది ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో ఉండగా, 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ద్వితీయస్థానం, 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
ఫలితాలను ఇంటర్‌బోర్డ్ అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించగా, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.