హిందువులు, బౌద్ధంలోకి మారాలంటే జిల్లా
మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరంటూ
గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బౌద్ధంతో పాటు జైన, సిక్కు
మతాలకు మారాలనుకుంటే గుజరాత్ మతస్వేచ్ఛ చట్టం – 2003 ప్రకారం ముందస్తు అనుమతి తప్పనిసరిగా
తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 8న గుజరాత్ రాష్ట్ర హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ
చేసింది.
ఆర్టికల్ 25(2) ప్రకారం
బౌద్ధం, సిక్కు, జైనులు హిందూ మతంలోనే ఉన్నందున అనుమతి అవసరం లేదని పలువురు
అధికారులు చెప్తున్నారని సర్క్యులర్‌లో పేర్కొంది.
గుజరాత్ మతస్వేచ్ఛ చట్టం ప్రకారం
బౌద్ధం ప్రత్యేక మతంగా ఉన్నందున ముందస్తు అనుమతి తప్పనిసరంటూ గుజరాత్ ప్రభుత్వం
వివరించింది. సిక్కు, జైనమతాల్లోకి
మారే వారికి ఇవే ఆదేశాలు వర్తిస్తాయని తేల్చి చెప్పింది.
గుజరాత్‌లో దళితులు బౌద్ధాన్ని
స్వీకరిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ లో
అహ్మదాబాద్‌లో ఒకేసారి 400 మంది బౌద్ధంలోకి మారారు. 2022
అక్టోబరులోనూ గిర్ సోమ్‌నాథ్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. గుజరాత్ బుద్ధిస్ట్
అకాడమీతో పాటు మరికొన్ని సంస్థలు మతమార్పిడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం