హర్యానాలో
దారుణం జరిగింది. స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు
కోల్పోయారు. మహేంద్రగఢ్ జిల్లా ఉన్హాని గ్రామ పరిధిలో గురువారం ఉదయం ఈ విషాదం
చోటుచేసుకుంది. రంజాన్ సెలవు అయినప్పటికీ జీఎల్ పబ్లిక్ స్కూల్ లో తరగతులు
నిర్వహించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక
దర్యాప్తులో తేలింది.
తీవ్రంగా
గాయపడిన ఇద్దరు విద్యార్థులను రోహటక్ ఆస్పత్రికి తరలించగా మరో 12 మంది
విద్యార్థులను స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు
వెల్లడించారు.
బస్సు
డ్రైవర్ మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి
చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. బస్సు
ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఆరేళ్ళ కిందట
ముగిసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఆర్ష
వర్మ తెలిపారు. అప్పటి నుంచి రెన్యూవల్ జరగలేదన్నారు.
స్కూలు యాజమాన్యాన్ని ప్రమాద
ఘటన గురించి ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరు
పెడుతున్నారు. తమ బిడ్డలను కాపాడాలని వేడుకుంటున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు