ఐఫోన్ ఉపయోగించే వారికి ఆ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అద్దెకు తీసుకున్న స్పైవేర్ ద్వారా సైబర్ దాడులు జరిగే ప్రమాదముందని థ్రెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 91 దేశాల్లో ఐఫోన్ వినియోగదారులకు ఈ ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఆయా దేశాల్లో ఐఫోన్ వినియోగదారులకు ఇప్పటికే అలర్ట్ నోటిఫికేషన్లు పంపుతున్నారు.
ఎన్ఎస్ఓ తయారు చేసిన మాల్వేర్ను మెషినరీ స్పైవేర్గా వ్యవహరిస్తుంటారు. అత్యాధునిక సాంకేతిక దీని సొంతం. ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలనేది స్పైవేర్ ద్వారా నేరగాళ్లు నిర్ణయిస్తారని ఆపిల్ సంస్థ తెలిపింది.గతంలోనూ ఆపిల్ సంస్థ ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. అయితే అవి ప్రభుత్వ మద్దతు ఉన్న స్పైవేర్లుగా ప్రకటించింది. ప్రస్తుతం కిరాయి స్పైవేర్స్ ద్వారా దాడులు జరిగే అవకాశముందని యూజర్లను హెచ్చరించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు