ఎలక్ట్రిక్ కార్ల తయరీ సంస్థ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత
పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. భారత్‌లో పెట్టుబడుల ప్రణాళిక గురించి ఈ పర్యటనలో
వెల్లడించే అవకాశముంది. ఏప్రిల్
22 నుంచి మస్క్ పర్యటించనున్నారు. అయితే
దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.
ప్రధాని మోదీ కిందటేడాది జూన్‌లో అమెరికా
పర్యటనకు వెళ్లినప్పుడు, మస్క్ తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా 2024లో భారత్ పర్యటనకు వచ్చే ఆలోచన ఉందని మోదీకి మస్క్ తెలిపారు.
టెస్లా
లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆకర్షించే ఉద్దేశంతో, ఇటీవలే కేంద్రప్రభుత్వం కొత్త విద్యుత్ వాహన విధానాన్ని ప్రకటించింది. భారత్ లో కనీసం 50 కోట్ల
డాలర్ల పెట్టుబడితో తయారీ యూనిట్లను
నెలకొల్పే సంస్థలకు, దిగుమతి
సుంకం రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు