అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ దేశాల కూటమి క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చైనాను నిలువరించేందుకు ఈ నాలుగు దేశాలు కూటమిగా ఏర్పడ్డాయంటూ వస్తోన్న పుకార్లను ప్రధాని మోదీ ఖండించారు. చైనా, భారత్ మధ్య శాంతి కేవలం ఈ రెండు దేశాలకు, ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికి కీలకమన్నారు. భారత్, చైనా మధ్య నెలకొన్న అనిశ్చితి చర్చల ద్వారా తొలగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో జరిగే అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. భారత్ ఎదుగుతున్న తీరు ప్రపంచానికి ఆదర్శమన్నారు.
వర్థమాన భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో సమస్యలు కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌ల కూటమి క్వాడ్ ఎవరికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసింది కాదని పునరుద్ఘాటించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం ఒక చారిత్రక ఘట్టమన్నారు. రాముడు మరలా భారత్‌కు తిరిగి వచ్చారని పేర్కొన్నారు. సహజంగా పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల ఆదరణ కోల్పోతూ ఉంటాయి, కానీ ప్రజల్లో బీజేపీకి ఆదరణ రోజు రోజుకు పెరుగుతోందని జాతీయ మీడియాకు ప్రధాని మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు