అయోధ్యకు వెళ్ళే భక్తులకు మరో గొప్ప అవకాశం లభించనుంది. రామ్
లల్లా దర్శనంతో పాటు బంగారు రామాయణాన్ని దర్శించి తరించవచ్చు. బంగారు రామాయణ పుస్తకాన్ని రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించారు.
రామ్‌లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై దీనిని ప్రతిష్ఠించారు.
గ్రంథం పైభాగంలో వెండితో చేసిన రాముడి
పట్టాభిషేక దృశ్యం కనిపిస్తుంది.
మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ
ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, అతని
భార్య సరస్వతి రామాలయ ట్రస్ట్‌కు ఈ ప్రత్యేక గ్రంథాన్ని కానుకగా అందజేశారు. చెన్నైకి
చెందిన వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ దీనిని తయారు చేసింది.
చైత్ర నవరాత్రుల సందర్భంగా అయోధ్యకు
భక్తులు పోటెత్తారు.
500 ఏళ్ళ తర్వాత ఈ ప్యాలెస్‌లో రాంలాల్లా జయంతి
వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలరాముడి కోసం సందర్భంగా ప్రత్యేక ఖాదీ కాటన్‌తో దుస్తులను
తయారు చేసినట్లు ప్రముఖ డిజైనర్ మనీష్ త్రిపాఠి తెలిపారు. వీటిపై చేతితో బంగారం, వెండి వైష్ణవ చిహ్నాలను ముద్రించామన్నారు.
భక్తులను వేడి నుంచి కాపాడేందుకు
శ్రీరామ జన్మభూమి మార్గంలో 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్‌ను
ఏర్పాటు చేయగా ప్రదక్షిణ మార్గంలో జూట్ కార్పెట్ వేశారు. దీంతో పాటు దాదాపు 50కి పైగా చోట్ల తాగునీటి కేంద్రాలను సిద్ధం
చేశారు.
శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు బాలరాముడిని తాకనున్నాయి. ఆప్టోమెకానికల్
సిస్టమ్ ద్వారా సూర్య కిరణాలు ఏప్రిల్ 17న
మధ్యాహ్నం 12
గంటలకు సరిగ్గా గర్భగుడిలోకి
చేరుకుంటాయి. అనంతరం రామయ్య నుదిటిపై 75 మిల్లిమీటర్ల
పరిమాణంలో గుండ్రని తిలకం రూపంలో 4 నిమిషాల
పాటు కనిపిస్తాయి.