వచ్చే
విద్యా సంవత్సరంలో సిలబస్ మార్పు, పాఠ్యపుస్తకాల
విడుదలపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) కీలక ప్రకటన చేసింది. 3, 6 తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో
పాఠ్యపుస్తకాలు విడుదల చేస్తామని
ప్రకటన చేసింది.
మూడో తరగతి పుస్తకాలు ఏప్రిల్ చివరివారంలో, ఆరో తరగతి పుస్తకాలు మే మధ్యలో విడుదల
చేస్తామని స్పష్టం చేసింది. ఇక 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించి 2023-24 ఎడిషన్స్ పుస్తకాల 1.21
కోట్ల కాపీలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
కొత్త
కరికులమ్‌కు అనుగుణంగా ఆరో తరగతి విద్యార్థులను సిద్ధం చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల
కోసం బ్రిడ్జ్ కోర్సు అందుబాటులో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ఎన్సీఆర్టీ
వెల్లడించింది.
పాఠ్య
పుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ వెబ్సైట్ తోపాటు DIKSHA, ePathshala పోర్టల్, యాప్‌లలో ఉచితంగా లభిస్తాయని వివరించింది.
4, 5, 9, 11 తరగతులకు సంబంధించిన 27.58 లక్షల పుస్తకాలు విడుదలయ్యాయని.. ఈ
తరగతులకు కొత్తగా మరో 1.03 కోట్ల కాపీలను ప్రింటింగ్ కోసం
ఆర్డర్ చేసినట్లు తెలిపింది. మే 31
నాటికి ఇవి కూడా అందుబాటులోకి రానున్నాయి.