కాకినాడ
జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్
కళ్యాణ్, నాలుగు రోజులుగా అక్కడ పర్యటిస్తూ స్థానికులతో మమేకం అవుతున్నారు . అన్నీ
వర్గాలతో సమావేశం అవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తనను గెలిపిస్తే స్థానికులు
ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని వాగ్ధానం చేశారు.
నేటి
ఉదయం స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేకప్రార్థనలు చేశారు. అనంతరం యు.
కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు వెళ్ళారు.
పొన్నాడ గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్, ఓ సామాన్య
వ్యక్తి ఇంటికి వెళ్ళారు. వారితోపాటు నవ్వారు మంచంపై కూర్చోని కష్టసుఖాలు
తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో సమావేశమై మాట్లాడేందుకు సమాయత్తం అవ్వగా అనుమతి
లేదంటూ అధికారులు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు
పొందిన జాతీయ, ప్రాంతీయ
పార్టీలు, గుర్తింపు
లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన ప్రాంతీయ
పార్టీల బాబితాలో వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తును కేటాయించింది.
రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో
జనసేన ఉండగా, ఆ పార్టీ గుర్తు గాజు
గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఈసీ ఉంచింది.