ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు పాలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరు నెలలుగా తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.మద్యం విధానం తయారీలో కొందరికి మేలు చేసే విధంగా వ్యవహరించి, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఎంపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆప్ ఎంపీ తనను అక్రమంగా అరెస్ట్ చేశారని బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెయిల్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఈడీ చెప్పడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబరులో ఎంపీ సంజయ్ సింగ్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తిహార్ జైలుకు తరలించారు.తాజాగా బెయిల్ మంజూరు కావడంతో రేపు జైలు నుంచి సంజయ్ సింగ్ విడుదలయ్యే అవకాశముంది.