పాఠశాలలకు
వేసవి సెలవులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు సెలవులను ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో
స్పష్టం చేసింది. మొత్తం 50
రోజుల పాటు విద్యార్థులకు సెలవులు
రానున్నాయి.
ఎండల
కారణంగా మార్చి 18 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు
నిర్వహిస్తున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రస్తుతం తరగతులు
నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి
వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
వేసవి ప్రతాపానికి ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు
రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత
పెరగనున్నాయి. ఈ క్రమంలో స్కూళ్లకు రాష్ట్రప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు