డిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటి వరకు ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. బెయిల్ కోసం కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు గతంలోనే కొట్టివేసింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఇవాళ కేజ్రీవాల్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. 14 రోజులు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఈడీ కస్టడీ ముగియడంతో, రౌస్ అవెన్యూ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటీషన్ కూడా తిరస్కరణకు గురికావడంతో ఇక జైలుకు తరలించనున్నారు.