పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తోన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ లెబనాన్లో ఐరాసకు చెందిన ముగ్గురు సైనిక అధికారులు, ఓ అనువాదకుడు గాయపడ్డారు. వారికి సమీపంలో షెల్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐరాస అందించిన వివరాల ప్రకారం.
లెబనాన్లో పరిశీలనకు వెళ్లిన ఐక్యరాజ్యసమితి బృందానికి సమీపంలో షెల్ పడిండి. అది పేలడంతో దాని ధాటికి మొత్తం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. అయితే ఐరాస వాదనలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది.