జనసేన పార్టీ మచిలీపట్నం లోక్సభ
అభ్యర్థిని ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి ఈ సారి జనసేన
తరఫున పోటీలో ఉండనున్నారు. 2019 ఎన్నికల్లో బాలశౌరి, వైసీపీ తరఫున పోటీ చేసి
గెలిచారు. ప్రస్తుతం జనసేనలో చేరారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో
భాగంగా జనసేన పార్టీ రెండు లోక్సభ స్థానాలు, 21 శాసనసభ
స్థానాల్లో పోటీ చేయనుంది.
అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను జనసేన
ఇంకా ఖరారు చేయలేదు. విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ పేరు దాదాపు
ఖాయమైనట్లు సమాచారం. వంశీకృష్ణ గతంలో వైసీపీ తరఫున శాసనమండలికి ఎన్నికయ్యారు.
ఇటీవలే వైసీపీని వీడి జనసేనలో చేరారు.
అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాల్లో ఆశావహులు
ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై జనసేన అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.