యువతను
విప్లవ తీవ్రవాదం వైపు ప్రొత్సహించడంతో పాటు మావోయిజాన్నివ్యాప్తికి తెరవెనుక
తతంగం నడుపుతూ నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)కు మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్న
వ్యక్తిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జీషీటు దాఖలు చేసింది. ఎన్ఐఏ ఈ మేరకు విశాఖ కోర్టులో చార్జిషీటు సమర్పించింది.
రామక్కగిరి
చంద్ర అనే వ్యక్తి మావోయిస్టు సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్నాడంటూ యూఏ(పీ) చట్టం కింద
కుట్ర కేసు నమోదు చేసింది. విప్లవతీవ్రవాదంపై వైపు యవతను ప్రేరేపించేందుకు కుట్ర పన్నినట్ల
అదనపు ఛార్జిషీటులో ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు.
ప్రగతిశీల కార్మిక సమాఖ్య(PKS) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తూ
మావోయిస్ట్ రిక్రూట్మెంట్ కు పాల్పడుతున్నట్లు తేలింది. అతడి నుంచి పిస్టల్ తో
పాటు ఇతర పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఛార్జిషీటులో ఎన్ఐఏ పేర్కొంది.
సీపీఐ(మావోయిస్ట్)
అగ్రనేతలతో కలిసి భారీ కుట్రకు పన్నాగం రచించినట్లు విచారణలో తేలింది.
ముంచింగ్‌పుట్
కుట్ర కేసులో భాగంగా 2021 మేలో ఏడుగురు నిందితులతో ఛార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ,
తాజాగా అనుబంధ ఛార్జిషీటులో ఎనిమిదో వ్యక్తిని చేర్చించి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు