జమ్మూ-శ్రీనగర్
జాతీయ రహదారిపై విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ ట్యాక్సీ అదుపుతప్పి లోయలో పడింది.
ఈ ప్రమాదంలో పదిమంది చనిపోయారు. రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చాష్మా పరిధిలో ఈ
దారుణ ఘటన జరిగింది.
ప్రమాద
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే రాంబాన్ డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్ తో
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. సహాయ
చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో
చనిపోయినవారికి సంతాపం వ్యక్తం చేశారు.
ప్రమాద
సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, క్యూఆర్టీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని
సహాయ చర్యలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు