లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా నేటి నుంచి రెండో దశ
పోలింగ్‌కు నామినేషన్ల పర్వం మొదలైంది. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల
దాఖలుకు ఏప్రిల్ 4 ఆఖరి
గడువు. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్
5న నామినేషన్ పత్రాల పరిశీలన
జరగనుంది.
ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్లో నామినేషన్ల పరిశీలన
జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా, ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
ఫేజ్ -2లో భాగంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని
మొత్తం 88 లోక్‌సభ
స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఔటర్ మణిపూర్ లో స్థానంలో రెండో
దశలో ఎన్నికలు జరగనుండగా, ఇన్నర్ మణిపూర్ స్థానంలో మొదటి దశ నోటిఫికేషన్ లో భాగంగా
ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి.