సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కలేదని ఆత్మహత్యాయత్నం చేసుకున్న కోయంబత్తూరు ఎంపీ గణేశమూర్తి చనిపోయారు. టికెట్ దక్కలేదని తెలియడంతో నాలుగు రోజుల కిందట ఆయన విష గుళికలు మింగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి కిందట మరణించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో గణేశమూర్తి డీఎంకే, ఎండీఎంకే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారు. తాజాగా పొత్తులో భాగంగా ఆ సీటును డీఎంకే దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా దురైవైగోను ప్రకటించారు. తీవ్ర మనస్థాపానికి గురైన గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో విష గుళికలు మింగాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు