పాకిస్తాన్
లో దారుణం జరిగింది. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ లో ఆత్మాహుతి దాడి ఘటనలోఆరుగురు
చనిపోయారు. వీరిలో ఐదుగురు చైనీయులతో పాటు ఓ పాకిస్తానీ ఉన్నారు. ఇస్లామాబాద్
నుంచి దసు ప్రాంతంలోని తమ క్యాంపుకు చైనా ఇంజినీర్ల టీమ్ వెళుతుండగా ఆత్మాహుతి
దాడి జరిగింది. చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌ను , ఓ
ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో ఢీకొట్టాడు. దీంతో
ఐదుగురు
చైనా ఇంజినీర్లు, వారి వాహనం డ్రైవర్ గా ఉన్న ఓ పాకిస్తానీ
జాతీయుడు మరణించారు.
పేలుడు ధాటికి చైనా ఇంజినీర్ల వాహనం రోడ్డు పై నుంచి పక్కనే
ఉన్న ఓ గోతిలోకి ఎగిరిపడింది, అనంతరం
మంటలు అలుముకోవడంతో కాలి బూడిద అయింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు