బెంగళూరులో నీటి కొరత తీవ్ర స్థాయికి చేరింది. కోటిన్నర జనాభా ఉన్న బెంగళూరులో ప్రజల నీటి అవసరాలు తీర్చడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రజల అవసరాల్లో కనీసం సగం నీరు కూడా సరఫరా కావడం లేదు. నీటిని వృధా చేసే వారిపై బెంగళూరు నీటి సరఫరా అధికారులు జరిమానా విధించారు. తాజాగా 22 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున జరిమానా విధించారు.
కారు కడగడంతోపాటు, మొక్కలకు నీరు పోసిన 22 కుటుంబాలకు లక్షా 10 వేల జరిమానా విధించారు. ఇప్పటికే నగరంలో ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేసుకుని ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం చేయి కడిగేందుకు కూడా చాలా ప్రాంతాల్లో నీరు లభించడం లేదు. నగరపాలక సంస్థ నీటి వృధాను అరికట్టేందుకు పలు చర్యలు ప్రారంభించింది. కార్లు కడగడం, మొక్కలకు నీరు పోయడం నిషేధించింది. ఉల్లంఘించిన వారిపై జరిమానాల కొరఢా ఝుళిపిస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు