హైతీలు మరోసారి రెచ్చిపోయారు. చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణులతో దాడి చేశారు. శనివారం ఎర్రసముద్రంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. క్షిపణి దాడి తరవాత నౌకలో మంటలు చెలరేగినట్లు సమాచారం. అరగంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
పనామా జెండాతో ప్రయాణిస్తోన్న ఓడపై ఈ నెల 23న హౌతీలు క్షిపణితో దాడి చేశారు. దాడికి గురైన నౌకను చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం 4 గంటల తరవాత ఘటన చోటు చేసుకుంది. క్షిపణి దాడిలో నౌక దెబ్బతింది. ఇది మంగళూరు వెళుతోందని తెలుస్తోంది. యెమెన్ సమీపంలోని మోఖాకు 23 మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు