ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ అక్కడ నుంచే పాలన ప్రారంభించారు. తమ నేత జైలు నుంచే పాలన సాగిస్తారని ఆ పార్టీ నేతలు శనివారంనాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నగరంలో మంచినీటి సరఫరాకు సంబంధించిన మొదటి ఉత్తర్వులను జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. రాజధాని నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్న అతిషికి సీఎం కేజ్రీవాల్ ఓ నోట్ విడుదల చేసినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ మద్యం పాలసీ విధానాన్ని అనుకూలంగా మలచుకుని వందలకోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ గత గురువారంనాడు అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతి మేరకు వారం రోజులు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉండనున్నారు. తరవాత కోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటారు. తాము రాజకీయంగా ఎదగకుండా అణచివేసేందుకే బీజేపీ అరెస్టులకు పాల్పడుతోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.
కోర్టు తీర్పు తరవాత సీఎం కేజ్రీవాల్‌ను జైలుకు తరలించకుండా గృహనిర్భంధంలో ఉంచేందుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనుమతిస్తే ఆయన సీఎంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఏ భవాన్ని అయినా జైలుగా ప్రకటించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవకాశం లేదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, పదవిలో ఉన్నవారు జైలుకు వెళితే వారిని తొలగించాల్సి ఉంటుంది. అలా కేజ్రీవాల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ తొలగిస్తారా? లేదా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు