పంజాబ్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం కారణంగా పలువురు అనారోగ్యానికి గురయ్యారు. ఇథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి 40 మంది ఆస్పత్రిలో చేరారు.
వీరిలో బుధవారం నాడు నలుగురు ప్రాణాలు కోల్పోగా, గురువారం నాడు పాటియాలాలో మరో నలుగురు చనిపోయారు. శుక్రవారం నాడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 8 మంది ప్రాణాలు విడవగా, నేడు మరో ఐదుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది.
ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసిన సిట్, ఓ ఇంట్లో సోదాలు నిర్వహించి 200 లీటర్ల ఇథనాల్ ను స్వాధీనం చేసుకుంది.
గతంలో కూడా పంజాబ్ లో కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందారు. 2023 ఏప్రిల్ లో సంగ్రూర్ లో నకిలీ మద్యం కారణంగా ముగ్గురు చనిపోగా, 2020లో 112 మంది ప్రాణాలు విడిచారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు