కొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు. ఎన్నికల కోడ్ వచ్చిన మూడు రోజుల్లో 385 కేసులు నమోదు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఇప్పటికే 40 మంది వారంటీర్లను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వాలంటీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ముఖేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 392 దరఖాస్తులు పరిష్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వాలంటీర్లపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు ముఖేష్‌కుమార్ మీనా గుర్తుచేశారు. సీ విజిల్ ద్వారా అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం వంద నిమిషాల్లో పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్ష నిర్వహణ ఉంటుందన్నారు.
హింస లేకుండా, రీ పోలింగ్‌కు తావులేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్మీనా స్పష్టం చేశారు.