సార్వత్రిక ఎన్నికల కారణంగా సీఏ పరీక్షలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా రీ షెడ్యూల్ చేసింది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల తేదీలను సవరించింది. తాజా షెడ్యూల్ ప్రకారం సీఏ ఇంటర్, గ్రూప్ 1 పరీక్షను మే 3, 5, 9 తేదీల్లో నిర్వహిస్తారు. గ్రూపు 2 పరీక్ష మే 11, 15, 17 తేదీల్లో జరుపుతారు.
విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే సీఏ ఫైనల్, గ్రూప్ 1 పరీక్షను మే 2, 4, 8 తేదీల్లో జరగనున్నాయి. ఫైనల్ గ్రూప్ 2 పరీక్ష మే 10, 14, 16 తేదీల్లో జరపనున్నారు. తాజా షెడ్యూల్లో ఇక ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.మెంబర్స్ ఎగ్జామినేషన్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ అసెస్మెంట్ పరీక్షలు మే 14, 16 తేదీల్లో నిర్వహించున్నట్లు ఐసీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.