తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.తమిళిసై రాజీనామాతో తెలంగాణ గవర్నర్ పదవికి
ఖాళీ ఏర్పడింది. తాజాగా తెలంగాణ గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్‌ను నియమించారు. ఆయన ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
రాధాకృష్ణన్ తమిళనాడులోని కొయంబత్తురులో 1957లో జన్మించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. రెండు సార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు. 2016 నుంచి మూడేళ్ల పాటు కాయర్ బోర్డు ఛైర్మన్‌గా చేశారు. బీజేపీ సీనియర్ నేతల్లో రాధాకృష్ణన్ ఒకరు. గత ఏడాది నుంచి రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గాను ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.