Mother kills
daughter
పెళ్ళి విషయంలో తలెత్తిన వివాదంలో 19 ఏళ్ళ యువతిని కన్నతల్లే హత్య చేసిన ఘటన ఇబ్రహీంపట్నంలో
చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ
మొదటి సంవత్సరం చదువుతున్న యువతిని ఆమె తల్లి సోమవారం రాత్రి గొంతు నులిమి
చంపినట్లు మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… యువతి
తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆమె బంధువును వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి
చేస్తున్నారు. కానీ ఆ యువతి ఒప్పుకోలేదు. తను ఒక యువకుణ్ణి ప్రేమించాననీ, అతన్నే
పెళ్ళాడతాననీ పట్టుపట్టింది.
సోమవారం కూతురు ప్రియుడితో మాట్లాడడం
గమనించిన తల్లి, ఆమెతో వాగ్వాదానికి దిగింది. ఆ క్రమంలో
కూతురిని గొంతు నులిమి చంపిందని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు
ప్రయత్నించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్
లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, తల్లి స్పృహ తప్పిపోవడంతో
ఆస్పత్రికి తరలించారు.