Another Indian
dies in US, Family alleges murder
అమెరికాలో ఓ తెలుగు యువకుడు మరణించిన
ఘటన వెలుగు చూసింది. అతన్ని హత్య చేసారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాంటిదేమీ లేదని
అమెరికా పోలీసులు కొట్టిపడేసారు.
అభిజిత్ పరుచూరు గుంటూరు జిల్లా
బుర్రిపాలెం గ్రామానికి చెందిన 20 ఏళ్ళ యువకుడు. అమెరికాలోని బోస్టన్
విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్ధి. అతని తల్లిదండ్రులు పరుచూరి చక్రధర్,
బోరున శ్రీలక్ష్మి కనెక్టికట్‌లో నివసిస్తున్నారు.
మార్చి 11న అభిజిత్ కనిపించడం లేదంటూ
అతని స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. అతని
సెల్‌ఫోన్ సంకేతాల ఆధారంగా అతని మృతదేహం ఎక్కడుందో కనుగొన్నారు. అభిజిత్
తల్లిదండ్రులు మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చారు. సోమవారంనాడు గుంటూరులో
అంత్యక్రియలు నిర్వహించారు.
అభిజిత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు
విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోనే హతమార్చారనీ, అతని శవాన్ని కారులో తీసుకువెళ్ళి ఒక
అడవిలో వదిలేసారనీ అతని కుటుంబం ఆరోపించింది. అయితే న్యూయార్క్‌లోని భారత
కాన్సులేట్ జనరల్ మాత్రం, ప్రాథమిక దర్యాప్తును బట్టి ఎలాంటి అనుమానాస్పద కారణాలూ
లేవని తేలిందని ప్రకటించింది.
‘‘అభిజిత్ తల్లిదండ్రులు పోలీసులతో
నేరుగా కాంటాక్ట్‌లో ఉన్నారు. అతని మృతి వెనుక ఎలాంటి అనుమానాస్పద కారణాలూ లేవని
ప్రాథమిక దర్యాప్తులో తేలింది’’ అని కాన్సులేట్ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
2024లో ఇప్పటివరకూ కనీసం 9మంది భారతీయులు లేదా భారత
సంతతి విద్యార్ధులు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు