మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసు
బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది.
గడ్చిరోలిలోని
అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తండగా, మావోయిస్టులు ఎదురుపడ్డారు.
దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. చనిపోయిన వారంతంతా మావోయిస్టు
అగ్రనేతలని, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు.
మంచిర్యాల
డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ ఎన్ కౌంటర్ లో
ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు
వెల్లడించారు. పోలీసులు నిర్వహించిన కూంబింగ్ లో భాగంగా భారీగా పేలుడు
పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు