తెలుగు రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన
భద్రత మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
గతంలో పదో తరగతి ఫెయిల్ అయి, మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 1,02,528 మంది ఉన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.
130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ
కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ కు అడ్డకట్ట వేసేందుకు
ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించడంతో
ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే
అవకాశం కల్పించారు.
తెలంగాణలోనూ పదోతరగతి పరీక్షలు
ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ దఫా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేలా
వెసులుబాటు కల్పించారు.
తెలంగాణలో 2,676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5.05 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు
రాయనున్నారు.