ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ తొమ్మిదోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కేసులో మనీలాండరింగ్‌పై విచారించేందుకు మార్చి 21న ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇది తొమ్మిదోసారి కావడం గమనార్హం.
గతంలో అనేకసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ ఈడీ అధికారుల ముందు హాజరుకాలేదు. దీంతో వారు ఢిల్లీ కోర్టులో రెండు కేసులు నమోదు చేశారు.దీనిపై విచారణకు శనివారంనాడు కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు. కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. బెయిల్ వచ్చిన ఒక్కరోజులోనే ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇదే కేసులో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.