కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన సీఏఏ అమలుపై, ఎంఐఎం ఎంపీ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ, స్టే ఇవ్వాలంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్ధీన్ ఒవైసీ పిటిషన్ వేశారు. కేసు పరిష్కారం అయ్యే వరకు సీఏఏ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నిలిపివేయాలని ఒవైసీ పిటిషన్లో కోరారు.
సీఏఏలోని సెక్షన్ 2 (1) కింద ఎవరికీ ఆశ్రయం ఇవ్వ కూడదన్నారు. ఈ నిబందన ప్రకారం, 2014కు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్థాన్ దేశాల నుంచి ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా వచ్చిన హిందువులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లను అక్రమ వలసదారులుగా గుర్తించరని పిటిషనర్ పేర్కొన్నారు. ఇటీవల సీఏఏ అమలుకు హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.