భారత సైన్యం మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. సరకు రవాణా నౌకలను హైజాక్ చేయాలనుకున్న సముద్రపు దొంగలు పారిపోయేలా చేసింది.గత ఏడాది సముద్రపు దొంగలు ఓ నౌకను హైజాక్ చేశారు. హైజాక్ చేసిన నౌకను దొంగతనాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి దొంగల నౌకను భారత నేవీ గుర్తించి అడ్డుకుంది. వెంటనే పైరేట్లు భారత సైనికులపై కాల్పులకు తెగబడ్డారు. సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చింది. హిందూమహాసముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజాగా మంగళవారంనాడు మరో ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన రవాణా నౌకను హైజాక్ చేశారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి 23 మందిని అదుపులోకి తీసుకున్నారు.తమను రక్షించాలంటూ సిబ్బంది భారత నేవీకి అత్యవసర సిగ్నల్స్ పంపించారు. వెంటనే నేవీ రంగంలోకి దిగింది. హైజాక్ చేసిన నౌకను సోమాలియా దిశగా తరలిస్తుండగా నేవీ అధికారులు విడిపించారు. ఈ ఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు