కెనడాలో ముగ్గురు సభ్యుల భారత సంతతి కుటుంబం మంటల్లో చిక్కుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మార్చి 7న ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతుల శరీరాలు పూర్తిగా కాలిపోయాయని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో 51 సంవత్సరాల రాజీవ్ వరికూ, అతని భార్య కొత్తా శిల్పా, వారి కుమార్తె మహెక్ వరికూ ఉన్నారు. ఒట్టావా ప్రావిన్స్‌లోని బిగ్ స్కైవే సమీపంలోని వారి నివాసంలో మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
మొదట ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంగా అందరూ భావించారు. కానీ అది ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదం కాదని పోలీసుల విచారణలో తేలింది. ఈ అగ్నిప్రమాదం అనుకోకుండా జరిగింది కాదని కెనడా పోలీసు అధికారి టార్న్ యంగ్ తెలిపారు. ప్రమాద కారణాలను గుర్తించేందుకు పరిశోధన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. మార్చి 7న ఈ ఘటన జరిగి ఉంచవచ్చని అంచనా వేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు