ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం కేంద్ర్ర ప్రభుత్వం నియమించిన మాజీ రాష్ట్రపతి
రామ్‌నాథ్ కోవిద్ కమిటీ నేడు నివేదికను అందజేయనుంది. ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఒకేసారి
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ నేతృత్వంలో
కమిటీ ఏర్పాటైంది. దాదాపు 8 అధ్యాయాలుగా ఉన్న 18000 వేల పేజీల నివేదికను కమిటీ
సభ్యులు నేడు ద్రౌపది ముర్మకు అందజేయనున్నారు.
జమిలి ఎన్నికల నిర్వహణ భారత్ లో సాధ్యమేనా, ఖర్చు, ఏ మోడల్ అనుసరించాలనే అంశాలపై వివిధ వర్గాల నుంచి కోవిద్ కమిటీ
సమాచారం సేకరించడంతో పలువురు న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని క్రోడీకరించింది.
జమిలి
ఎన్నికలకు రాజ్యాంగంలోని ఆఖరి ఐదు అధికరణలను సవరించాలని కమిటీ సూచించినట్లు
సమాచారం. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఓటరు
లిస్టు జారీ చేసే అంశంపై కూడా కమిటీ సిఫార్సు చేయబోతుంది. రాజకీయపార్టీలు, లా కమిషన్, ఇతర ముఖ్య సంస్థల నుంచి ఈ కమిటీ
అభిప్రాయాలను సేకరించింది.