Manoharlal Khattar resigns as Haryana CM
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఇవాళ తన
పదవికి రాజీనామా చేసారు. రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి రాజీనామా
సమర్పించారు.ఆయనతో పాటు మంత్రివర్గం కూడా రాజీనామా చేసింది. కొత్త
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో
ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో జేజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకునే ఉద్దేశం
బీజేపీకి లేదు. దాంతో దుష్యంత్ చౌతాలా పార్టీని పక్కన పెట్టడం కోసమే బీజేపీ ఈ
నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు మంత్రివర్గంలో జేజీపీ సభ్యులు కూడా
ఉన్నారు.
ఖట్టర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించాక, బీజేపీ
ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోంది. అంతేకాక, ముఖ్యమంత్రి కూడా
మారవచ్చు. ఖట్టర్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు వెళ్ళడానికి సన్నాహాలు
చేసుకుంటున్నారు. ఆయన కర్నాల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతారని
తెలుస్తోంది.
హర్యానా శాసనసభలో 90
స్థానాలున్నాయి. వాటిలో 40 సీట్లతో బీజేపీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉంది.
కానీ మెజారిటీకి ఇంకొక 6 సీట్లు కావాలి. గత ఎన్నికల తర్వాత బీజేపీ, దుష్యంత్
చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో పొత్తు పెట్టుకుని, ఇప్పటివరకూ ప్రభుత్వాన్ని
నడపగలిగింది. ఇకపైనా, స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుతో అధికారంలో కొనసాగగలనని
భావిస్తోంది.